జగన్ పర్యటనల్లో భద్రతపై ఏపీ ప్రభుత్వం ఏమన్నదంటే?

పర్యటనల్లో తనకు భద్రత లేదంటూ జగన్ చేస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది

Update: 2025-06-25 04:27 GMT

పర్యటనల్లో తనకు భద్రత లేదంటూ జగన్ చేస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది. జగన్ పర్యటనలకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని స్పష్టం చేసింది. ఉన్మాద మూకతో వెళ్తూ శాంతిభద్రతలను చెడగొడుతున్నారని ప్రకటన విడుదల చేసింది. జగన్ పర్యటనకే కాకుండా సైకో మూకల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాల్సి ఉందన్న ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా ప్రభుత్వం ప్రొటోకాల్ కల్పిస్తొందని వెల్లడించింది.

అల్లరి మూకలను...
ప్రజాస్వామ్యంలో నిరసనలకు అవకాశమివ్వాలనే భద్రత కల్పిస్తున్నామన్న ప్రభుత్వం సైకో ముఠాలతో వెళ్తూ రెచ్చగొడుతున్నా సంయమనం పాటిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం జగన్ తప్పు ఒప్పుకోకుండా ప్రభుత్వంపైనే ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది. రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెడుతుంటే.. తప్పేముందని ప్రశ్నించడాన్ని తప్పుబట్టిన ప్రభుత్వం ఇలాంటివి ఉపేక్షించవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.














Tags:    

Similar News