పులివెందులకు ఉప ఎన్నిక తప్పదు
అసెంబ్లీ రాకుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై అనర్హత వేటు తప్పదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తెలిపారు
అసెంబ్లీ రాకుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై అనర్హత వేటు తప్పదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఏ ఎమ్మెల్యేకయినా ఇదే నిబంధన వర్తిస్తుందని చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే సభకు వచ్చి తమ సమస్యలను చెప్పుకోవాలని ఆయన సూచించారు. తమ మనోభావాలను పంచుకునే వేదిక అసెంబ్లీ అని రఘురామ కృష్ణరాజు అన్నారు.
జగన్ పై అనర్హత వేటు తప్పదు...
ఏ ఎమ్మెల్యే అయినా సెలవు అడగకుండా 60 రోజులపాటు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందని రఘురామ కృష్ణరాజు అన్నారు. జగన్ అసెంబ్లీకి రాకపోయిన అతనిపై అనర్హత వేటుతో పాటు పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని అన్నారు. జగన్ కి అసెంబ్లీకి వచ్చి తన మనోభావాలను చెప్పుకోవాలని రఘురామ కృష్ణరాజు సూచించారు.