రేపు సాయంత్రం ఢిల్లీకి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ భేటీ కానున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశముంది.
కేంద్ర మంత్రులను కలసి...
ఈ పర్యటనలో కేంద్ర మంత్రులను కూడా జగన్ కలిసే అవకాశముందని చెబుతున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, ప్రత్యేక హోదా, మూడు రాజధానుల విషయంపై జగన్ చర్చించే అవకాశాలున్నాయని తెలిసింది. మోదీతో పాటు అమిత్ షాను కూడా జగన్ కలిసే అవకాశముందని తెలిసింది.