అంబటి పిటీషన్ పై హైకోర్టు సీరియస్
మాజీ మంత్రి అంబటి రాంబాబు హౌస్ మోషన్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది
మాజీ మంత్రి అంబటి రాంబాబు హౌస్ మోషన్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తనపై రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులు నమోదయ్యాయని, వాటిని క్వాష్ చేయాలని అంబటి రాంబాబు తరుపున న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేశారు. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే రకమైన కేసును ముప్ఫయి ఐదు చోట్ల నమోదు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.
35కేసుల నమోదు పై...
అయితే ప్రభుత్వం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లో అందిన ఫిర్యాదుల ఆధారంగా ఎక్కడికక్కడ కేసులు నమోదు చేశారని తెలిపింది. అలా ఎలా ఒకే విధమైన దానికి సంబంధించి 35కేసులు నమోదు చేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల రెండో తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.