నేడు అంబటి కస్టడీ పిటీషన్ పై విచారణ
మాజీ మంత్రి అంబటి రాంబాబు కస్టడీ పిటషన్ పై గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది
మాజీ మంత్రి అంబటి రాంబాబు కస్టడీ పిటషన్ పై గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను కస్టడీకి ఇవ్వాలని నల్లపాడు పోలీసులు పిటీషన్ వేశారు.
గుంటూరు కోర్టులో...
మాజీ మంత్రి అంబటి రాంబాబును విచారించాల్సిన అవసరం ఉందని కస్టడీ పిటషన్ లో పేర్కొన్నారు. దీనిపై నేడు గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కస్టడీకి తీసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలతో పాటు ఇంటిపై జరిగిన దాడి విషయాలపై చర్చించాల్సి ఉన్నందున కస్టడీకి కోరినట్లు పోలీసులు తెలిపారు.