అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసు.. టీడీపీ ఎమ్మెల్యేపై కేసు

అంబటి రాంబాబు కార్యాలయం, ఇంటిపై దాడి కేసులో పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు

Update: 2026-02-03 06:33 GMT

అంబటి రాంబాబు కార్యాలయం, ఇంటిపై దాడి కేసులో పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త గల్లా రామచంద్రరావుతో పాటు మొత్తం 31 మందిపై కేసులు నమోదయ్యాయి. గల్లా మాధవిని ఏ1గా చేర్చారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్యాలయం, నివాసంపై జరిగిన దాడి ఘటనపై గుంటూరు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

మొత్తం 31 మందిపై...
ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవిని ఏ1గా, ఆమె భర్త గల్లా రామచంద్రరావును ఏ2గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 31 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటి ఇల్లు, కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News