అంబటిని గుంటూరుకు తీసుకొచ్చిన పోలీసులు

మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరుకు తీసుకు వచ్చారు.

Update: 2026-02-09 04:17 GMT

మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరుకు తీసుకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. అంబటి రాంబాబుపై రాష్ట్రంలో మొత్తం 36 కేసులు నమోదయ్యాయి.

పీటీ వారెంట్ పై...
అయితే గుంటూరులో గతంలో పోలీసుల విధులకు ఆటంకం కల్గించిన కేసులో పోలీసులు అంబటి రాంబాబును పీటీ వారెంట్ పై గుంటూరుకు తరలించారు. మరికాసేపట్లో ఈరోజు ఆయనను న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. వరస కేసులు నమోదు కావడంతో తనపై నమోదయిన కేసులను క్వాష్ చేయాలని అంబటి రాంబాబు పిటీషన్ దాఖలు చేశారు.


Tags:    

Similar News