నేడు ఏపీ లిక్కర్ కేసులో నిందితుల బెయిల్ పై విచారణ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుల బెయిల్ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది

Update: 2026-02-06 04:25 GMT

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుల బెయిల్ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు కండిషన్ బెయిల్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరి బెయిల్ ను రద్దు చేయాలని సిట్ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ముగ్గురు నిందితులకు...
అయితే ఈ బెయిల్ పై ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ట్రయల్ కోర్టులోనే విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. దీంతో నేడు బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటీషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేయనుంది. సిట్ మాత్రం వీరు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని వాదించనుంది.


Tags:    

Similar News