నేడు జోగి బ్రదర్స్ బెయిల్ రద్దు పిటీషన్ విచారణ

మద్యం కేసులో జోగి బ్రదర్స్ బెయిల్ రద్దు చేయాలని సిట్ పిటిషన్‌ నేడు విచారణ జరగనుంది.

Update: 2026-02-03 05:36 GMT

మద్యం కేసులో జోగి బ్రదర్స్ బెయిల్ రద్దు చేయాలని సిట్ పిటిషన్‌ నేడు విచారణ జరగనుంది. విజయవాడ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సిట్ అధికారులు జోగి బ్రదర్స్ బయట ఉంటే సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం జోగి బ్రదర్స్ ఈ కేసులో కండిషన్ బెయిల్ పై ఉండటంతో వారి బెయిల్ ను రద్దు చేయాలని పిటీషన్ వేసింద.ి

కండిషన్ బెయల్ పై...
సాక్షులనుకూడా బెదిరించే అవకాశముందని పేర్కొన్న సిట్ పిటీషన్ ను నేడు ఎక్సైజ్ న్యాయస్థానం విచారించనుంది. ఇటీవల మద్యం కేసులో దాదాపు రెండున్నర నెలలకుపైగానే రిమాండ్ ఖైదీగా ఉండి కండిషన్ బెయిల్ పై బయటకు వచ్చిన జోగి బ్రదర్స్ బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు ఎలాంటి తీర్పు వెలువడనుందన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News