పక్కా ఇళ్ల పురోగతిపై పెమ్మసాని సమీక్ష

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పై సమీక్ష నిర్వహించారు

Update: 2026-02-04 05:26 GMT

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పై సమీక్ష నిర్వహించారు. పీఎంఏవై కింద పనుల పరోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. -గ్రామీణ పథకం కింద ఇళ్ల నిర్మాణ పురోగతిని పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న గృహాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

గృహనిర్మాణాలకు సంబంధించి...

కేవలం గృహ నిర్మాణమే కాకుండా, తాగునీరు, పారిశుధ్యం మరియు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కూడా ఒకేసారి కల్పించేలా అధికారులను సమన్వయం చేసుకోవాలని పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. బలమైన గ్రామాల నిర్మాణమే లక్ష్యంగా, ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ 'వికసిత్ భారత్- 2047' దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు


Tags:    

Similar News