Srisailam : శ్రీశైలంలో శివభక్తుల నిరసన
శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు హాజరయ్యారు
శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు హాజరయ్యారు. శివమాల ధరించిన వాళ్లు ఎక్కువ మంది వచ్చారు. అయితే శివదీక్ష చేపట్టిన భక్తులు శ్రీశైలంలో తమకు దర్శనం సరిగా చేయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేశారు. సర్వదర్శనానికి ఆలస్యమవుతుందని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
క్యూ లైన్ విరగ్గొట్టి ఆలయంలోకి...
శివరాత్రి సందర్భంగా శివమాల వేసి అధిక సంఖ్యలో స్వాములు వస్తారని తెలిసి కూడా అధికారులు నిర్లక్ష్యంగ వ్యవహరిస్తున్నారని శివస్వాములు ఆరోపిస్తున్నారు. దీంతో కృష్ణదేవరాయ క్యూ లైన్ విరగ్గొట్టి ఆలయంలోకి శివ భక్తులు చొచ్చుకెళ్లారు. ఒక్కసారిగా వందలాది మంది శివభక్తులు తోసుకుని రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.