Chandrababu : నేడు కర్నూలు జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మిగనూరులో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలుగట్లలో శుక్రవారం జరిగే పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
పట్టాదారు పాసు పుస్తకాలను...
ఉదయం 11.30 గంటలకు కలుగట్ల చేరుకొని, పట్టాదారు పాసుపుస్తకాల్ని పంపిణీ చేస్తారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో పాటు కార్యకర్తల సమావేశానికి జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలి రానున్నారు.