Chandrababu : నేడు చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. నేడు ఉదయం 10.30 గంటలకు చంద్రబాబు సచివాలయానికి చేరుకుంటారు. ప్రభుత్వ పరిపాలన అంశాలపై సమీక్షలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు సచివాలయంలో చంద్రబాబు నాయుడు అమెరికా కాన్సులేట్ జనరల్ లౌరా విలియమ్స్ తో భేటీ అవుతారు.
టీడీపీ కార్యాలయానికి...
ఈ సమావేశంలో ఏపీలో పెట్టుబడులు, ద్వైపాక్షిక సంబంధాలపై చంద్రబాబు చర్చించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. టీడీపీ జిల్లా కమిటీలను ఖరారు చేయనున్నారు. జిల్లా కమిటీలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై నేతలతో చర్చించనున్నారు.