Amravathi : అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు

అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది

Update: 2025-12-18 02:56 GMT

అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏటా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలు అమరావతిలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది.

తగిన ఏర్పాట్లు చేయాలని...
హైకోర్టు దగ్గరలో 20 ఎకరాల్లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తగిన ఏర్పాట్లు చేయాలని సీఆర్డీఏకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెలలో జరగనున్న రిపబ్లిక్ వేడుకలు అమరావతిలోనే జరుగుతాయని ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొడటంతో రాజధాని మరింత ప్రజలకు చేరువ చేయడానికేనని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.


Tags:    

Similar News