Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ నేడు విడుదల అయింది

Update: 2026-01-23 02:59 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ నేడు విడుదల అయింది. ఈరోజు దావోస్ నుంచి అమరావతికి చేరుకోనున్న చంద్రబాబు నాయుడు వరస సమీక్షలలో పాల్గొంటారు. ఈనెల 25న రిపబ్లిక్ డే ఏర్పాట్లపై సమీక్ష చేయనున్నారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలను అమరావతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

రేపు నగరి నియోజకవర్గానికి...
రేపు చంద్రబాబు నాయుడు నగరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నగరిలో నిర్వహించనున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపాల్గొననున్నారు. ఈ నెల 26వ తేదీన అమరావతిలో జరిగే వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈనెల 27న ఎస్ఐపీబీ, సీఆర్డీఏ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈనెల 28న ఏపీ కేబినెట్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.


Tags:    

Similar News