ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారాయణ

అమరావతి మండలం కర్లపూడి లో రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు

Update: 2026-01-13 06:53 GMT

అమరావతి మండలం కర్లపూడి లో రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిన్న ల్యాండ్ పూలింగ్ ప్రారంభానికి వెళ్లిన మంత్రిని రైతులు రోడ్డు వేయాలని కోరారు. రైతులు అడిగిన వెంటనే రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయించి కాంట్రాక్ట్ సంస్థకు పనులు మంత్రి నారాయణ అప్పగించారు.

వారం రోజుల్లో...
కర్లపూడి నుంచి అనంతవరం వెళ్ళే 2.9 కిమీ రోడ్డు పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లోగా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి ఆదేశాలు చేశారు. అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతుందపి.అమరావతి మండలంలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాలు పూలింగ్ కు ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి అభివృద్ధి జరగాలంటే ఇన్నర్ రింగ్ రోడ్డు,ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అవసరమని, 80 శాతం పూలింగ్ పూర్తి కాగానే మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి టెండర్లు పిలుస్తామని తెలిపారు.


Tags:    

Similar News