ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాహనాలపై అదనపు పన్ను వసూలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలపై అదనంగా పదిశాతం సెస్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో రహదారి ప్రమాదాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీని ద్వారా రహదారి మరమ్మతులు చేయనున్నారు.
వాహనాల లైఫ్ ట్యాక్స్...
సొంత వాహనాల లైఫ్ ట్యాక్స్పై అదనంగా 10 శాతం రహదారి భద్రతా సెస్ వసూలు చేసేందుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. 'ఏపీ మోటార్ వాహన పన్ను చట్టం-1963' సవరణకు మంత్రివర్గం, గవర్నర్ ఆమోదం లభించింది. దీని ప్రకారం, ఇకపై వాహనం కొనుగోలు చేసే సమయంలో లైఫ్ ట్యాక్స్ల పాటు ఈ సెస్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సెస్ ద్వారా సేకరించిన నిధులను రోడ్ల మరమ్మతులు, బ్లాక్ స్పాట్ను తొలగించడానికి వినియోగించనున్నారు.