Amaravathi : అమరావతి రైతులకు గుడ్ న్యూస్
రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు
రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. ప్లాట్ల కేటాయింపుపై క్లారిటీ ఇచ్చారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ నేపథ్యంలో రాజధాని రైతులకు వేగంగా ప్లాట్లను కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ఈ మేరకు రైతులకు ప్లాట్లు కేటాయించేందుకు సిద్ధమయ్యారు.
ఈ నెల 23 నుంచి...
మంత్రి నారాయణ చెప్పిన దాని ప్రకారం ఈనెల 23న రాజధాని రైతులకు ఇ - లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరగనుంది. సీఆర్డీఏకు భూములిచ్చి ప్లాట్లు పెండింగ్ లో ఉన్న వారికి లాటరీ ద్వారా కేటాయింపు జరగనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. ప్లాట్లు పొందిన వారికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు.