Ys Jagan : రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం
Ys Jagan : రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం
రాజధాని అమరావతిపై వైఎస్ జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో భవనాల నిర్మాణాలకు చదరపు అడుగుకు పది వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఎక్కడా ఇలాంటి ధరలు లేవని ఆయన అన్నారు. అమరావతిలో భూ దోపిడీకి ఇది నిదర్శనం కాదా? అని జగన్ ప్రశ్నించారు. ఫైవ్ స్టార్ సౌకర్యాలు కల్పించినా చదరపు అడుగుకు ఐదు వేల రూపాయలు ఖర్చు కాదని వైఎస్ జగన్ అన్నారు.
చదరపు అడుగుకు...
హైదరాబాద్ నగరంలోనూ చదరపు అడుగు నిర్మాణం రెండు వేల రూపాయలకు మించదని, కానీ చంద్రబాబు మాత్రం అమరావతిలో చదరపు అడుగుకు పది వేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల వరకూ ఖర్చు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.