Chandrababu : అధికారులకు చంద్రబాబు సీరియస్ క్లాస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు

Update: 2026-01-12 11:53 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. అధికారులు పనిచేయకపోతే వివరణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. హెచ్ఓడీలు,మంత్రులు, అధికారుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నిధులను సరిగా సద్వినియోగం చేయని అధికారులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ఈ నెలాఖరు వరకూ టైం ఇస్తున్నానని, అప్పటి వరకూ కేంద్రం నుంచి వచ్చే నిధులను వెంటనే తీసుకు రావాలని చంద్రబాబు కోరారు.

ఫెయిల్యూర్ గానే చూస్తా...
లేకుంటే వారు వివరణఇవ్వల్సి ఉంటుందని తెలిపారు. కార్యదర్శుల పనితీరు మెరుగు పర్చుకోవాలనికోరారు. ఈ నెలాఖరులోగా కేంద్రం నుంచి నిధులు తీసుకు రాకపోతే ఫెయిల్యూర్ గానే చూస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖకు కేటాయించిన నిధులను సద్వినియోగం ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించారు. ప్రజలకు అందాల్సిన నిధులను మురిగిపోయేలా చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు.


Tags:    

Similar News