Andhra Pradesh : ప్రభుత్వోద్యోగులు ఈ పనిచేయకుంటే జీతం రాదట.. కొత్త నిబంధనలివే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు కీలక సమాచారం అందించింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు కీలక సమాచారం అందించింది. జీతం బ్యాంక్ అకౌంట్ మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన ద్వారా ఉద్యోగి స్వయంగా బ్యాంక్ అకౌంట్ మార్చలేరు. డీడీఓ లాగిన్ ద్వారా మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇందుకోసం ఉద్యోగులు చేయాల్సినవి ఏంటంటేడీడీవోకు రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని డాక్యుమెంట్లను జత చేయాలి. వాటిలో పాత బ్యాంక్ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ పొందుపర్చాలి. కొత్త బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ A/c No, IFSC స్పష్టంగా రాయాలి. ఉద్యోగి సంతకం చేసిన రిక్వెస్ట్ లెటర్ కూడా జత పర్చాలి.
నో డ్యూ సర్టిఫికేట్...
డీడీవో, సీఎఫ్ఎంఎస్ లో బ్యాంక్ చేంజ్ రిక్వెస్ట్ చేయాలి. దీనిని ట్రెజరీ ఆఫీసర్ కు పంపుతారు. ట్రెజరీ అప్రూవల్ తర్వాతే మార్పు అమలు ఉంటుంది. అప్రూవల్ తర్వాత తదుపరి నెల జీతం కొత్త బ్యాంక్ అకౌంట్‌లోనే జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. అయితే ఇవి చేయకపోతే జీతం పడదని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నో డ్యూ సర్టిఫికెట్ లేకపోతే రిజెక్ట్ చేస్తారు. అకౌంట్ నంబర్ / IFSC తప్పుగా నోట్ చేస్తే జీతం నిలిపేస్తారు. జీతం బిల్ ముందు అప్రూవల్ పూర్తవ్వాల్సి ఉంటుంది.