Amaravathi : నేడు అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని రైతులకు ప్లాట్ల కేటాయింపు జరగనుంది
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని రైతులకు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. ఈ మేరకు సీఆర్డీఏ అధికారులు అన్ని ఏర్పట్లు చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ కింద రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల కోసం ఈ ప్లాట్లను కేటాయించనున్నారు. అయితే ఈ లాటరీ విధానంలో ప్లాట్లను కేటాయించనున్నారు.
ఈ లాటరీ విధానం ద్వారా...
గతంలో కూడా ఈ లాటరీ విధానం ద్వారానే ప్లాట్ల కేటాయింపు జరిగింది ఈ మేరకు సీఆర్డీఏ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజధాని అమరావతిప్రాంతంలోని మొత్తం పథ్నాలుగు గ్రామాల్లోని తొంభయి మంది రైతులకు ప్లాట్ల కేటాయింపు జరుగుుతంది. మొత్తం 135 ప్లాట్లను కేటాయింనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.