Chandrababu : నేడు దావోస్ నుంచి అమరావతికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు దావోస్ నుంచి రానున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు దావోస్ నుంచి రానున్నారు. ఉదయం 8.25 గంటలకు హైదరాబా్ద్ కు చేరుకుంటారు. అనంతరం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకంుటారు. ఉదయం 10.30 గంటలకు గన్నవరం చేరుకోనున్న చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి చేరుకుంటారు.
పెట్టుబడుల సదస్సుకు...
దావోస్ లో పెట్టుబడుల సదస్సుకు హాజరైన చంద్రబాబు గత నాలుగు రోజుల నుంచి అక్కడే ఉన్నారు. వివిధ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయినచంద్రబాబు నాయుడు పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. దావోస్ ఎన్ఆర్ఐలతో కూడా భేటీ అయ్యారు. పెట్టుబడులు తీసుకు రావడమే లక్ష్యంగా దావోస్ పర్యటనను చంద్రబాబు చేపట్టారు.