Chandrababu : విధ్వంసమైన వ్యవస్థను గాడిలో పెడుతున్నాం

ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

Update: 2025-12-08 12:10 GMT

ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రతీ త్రైమాసికం, ఆర్ధిక సంవత్సరంలో సాధిస్తున్న రాష్ట్రస్థూల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కోక్కటిగా అమలు చేస్తున్నామన్న చంద్రబాబు చేయలేమని తాము పారిపోవటం లేదని, రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేలా చూస్తున్నామని అన్నారు. ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకుని అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు కూటమిపై ఉన్న నమ్మకం, విశ్వాసంతోనే భారీస్థాయిలో ప్రజలు మద్దతు పలికారన్నారు. ప్రజలు సుపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశారని, ఆస్తులను, భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి గతంలో అప్పులు తెచ్చారని, మూలధన వ్యయం చేయకపోవటంతో గతంలో ఎక్కడా ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదన్నారు

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత...
చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చాకే వాటిని ముందుకు తీసుకువెళ్లగలిగామన్న ఆయన స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రాజెక్టులపై మూల ధన వ్యయాన్ని గణనీయంగా పెంచి ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. సుపరిపాలన ద్వారా ప్రజల వద్దకు వెళ్లామని, వాట్సప్ గవర్నెన్సు ద్వారా ప్రజల చేతుల్లోకి పాలనను తీసుకెళ్లామని తెలిపారు. డీఫంక్ట్ అయిన వివిధ కేంద్ర పథకాలను మళ్లీ పునరుద్ధరించామన్న చంద్రబాబు 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను మళ్లీ రివైవ్ చేయగలిగామన్నార. పీక్ లోడ్ సమయంలో బహిరంగ మార్కెట్ లో విద్యుత్ ను యూనిట్ కు రూ.15 చోప్పున కొనుగోలు చేసిన పరిస్థితి ఉందని చంద్రబాబు తెలిపారు. కక్షపూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనాన్ని నష్టం చేశారని, ఈ వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వ్యవస్థలను నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
































Tags:    

Similar News