Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. పలు శాఖలపై సమీక్షను నిర్వహిస్తారు. అలాగే మొంథా తుపాను పై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమయి ఉండటంతో రానున్న కొన్ని గంటలు కీలకం కావడంతో జిల్లా కలెక్టర్లతోనూ చంద్రబాబు మాట్లాడతారు. ఉదయం ఉదయం 10.45 గంటలకు సచివాలయానికి చంద్రబాబునాయుడు రానున్నారు.
తుపానుపై సమీక్ష...
ఉదయం పదకొండు గంటలకు జిల్లాల పునర్విభజనపై సమీక్షను చంద్రబాబు చేస్తారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. మంత్రి వర్గ ఉప సంఘం జిల్లాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరించి నివేదికను సమర్పించింది. దీనిపై చంద్రబాబు నేడు సమీక్ష చేయనన్నారు. అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొంథా తుఫాన్‌పై చంద్రబాబు సమీక్ష చేస్తారు. మొంథా తుఫాన్ తీవ్రత దృష్ట్యా కలెక్టర్లకి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 5.45 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.