Chandrababu : కందుకూరు ఘటన పై చంద్రబాబు సీరియస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, డీజీపీతో సమావేశమయ్యారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, డీజీపీతో సమావేశమయ్యారు. హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారాయణతో పాటు డీజీపీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన హత్య విషయంపై చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ హత్యను కుల ఘర్షణలు రేపే విధంగా కొందరు ప్రయత్నిస్తున్నారని,వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
మృతుని కుటుంబానికి...
అలాగే మృతుని కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారంతో పాటు రెండు ఎకరాల భూమిని ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని చంద్రబాబు కోరారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండించాలన్నరు. మరొకవైపు చంద్రబాబు ఈ సమావేశంలో భీమవరం డీఎస్పీ వ్యవహారంపై చర్చించినట్లు తెలిసింది. డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.