Nara Lokesh : పన్నెండు గంటలకు లోకేశ్ భారీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ ప్రకటన చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు లోకేశ్ ఎక్స్ లో వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ విషయాన్ని రివీల్ చేస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో తీసుకు వచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలకు గాను అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించిందని చెప్పారు.
ప్రతిష్టాత్మకమైన అవార్డు...
ఆ ప్రతిష్టాత్మకమైన అవార్డు బలమైన మరియు విశ్వసనీయమైన జ్యూరీ ద్వారా ఈ అవార్డు లభించందని అన్నారు. ఆ అవార్డు ఏంటి? దాని విజేత ఎవరు అన్న దానిపై ఈరోజు మధ్యాహ్నం తెలియజేస్తానని తెలిపారు. అయితే ఏ అవార్డు వచ్చింది? ఎవరికి వచ్చిందన్న దానిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఉత్కంఠను అధికారుల్లో రేపినట్లయింది.