Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడంతో పాటు పార్టీ కార్యాలయానికి కూడా నేడు చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఉదయం 10.15 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి రానున్నారు. ఉదయం 10.30 గంటలకు కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం పార్టీ కార్యాలయానికి...
అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. రాష్ట్ర కమిటీలు, కమిటీల నిర్మాణంతో పాటు నామినేటెడ్ పోస్టులపై నేతలతో చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. అదే విధంగా పార్టీ నియోజకవర్గ స్థాయిలో నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.