Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. నేడు వివిధ శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులతో సమావేశం కానున్నారు. ఉదయం 10.15 గంటలకు చంద్రబాబు సచివాలయానికి చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు.
విద్యుత్తు శాఖపై...
విద్యుత్తు ఒప్పందాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మైనింగ్ శాఖపై చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులతో చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.