Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10.55 గంటలకు సచివాలయానికి రానున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉదయం 11.30 గంటలకు రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ శాఖలో తీసుకురావాల్సిన సంస్కరణల గురించి ప్రస్తావించనున్నారు. అలాగే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి చర్చిస్తారు.
రెవెన్యూ శాఖపై...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం నాలుగు గంటలకు హార్టికల్చర్, పూర్వోదయం, సాగునీటి రంగంపై చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే అందుబాటులో ఉన్న నేతలు, అధికారులతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.