Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

Update: 2025-11-24 04:14 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10.45 గంటలకు సచివాలయానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు ఫైనాన్సియల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సిస్టంపై చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. వివిధ శాఖల అధికారులు, మంత్రులతో సమావేశం కానున్నారు.

జిల్లాల పునర్విభజనపై...
మధ్యాహ్నం 12.30 గంటలకు జిల్లాల పున:ర్విభజనపై అధికారులతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమైన చంద్రబాబు నాయుడు నేడు అధికారంలో చర్చించిన తర్వాత జిల్లాల పునర్విభజనపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. మధ్యాహ్నం 2.30 గంటలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై చంద్రబాబు సమీక్ష చేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీజీఎస్‌పై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు ఉండల్లిలోని నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News