Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ప్రధానంగా విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సు పై మంత్రి వర్గ సమావేశం చర్చించనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో మొంథా తుపాను పంట నష్టాలపై కూడా చర్చించనున్నారు. రైతులకు ఇవ్వాల్సిన పరిహారంపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశముంది.
రాజధాని నిర్మాణానికి రుణం...
అలాగే రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఎన్ఏబీఎఫ్ఐడీ నుంచి 7.500 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకునేందుకు మంత్రి వర్గ సమావేశం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించి సమావేశం నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు సంక్షేమ పథకాలకు అవసరమైన నిధుల సమీకరనపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.