Andhra Pradesh : ఈ నెల 24న ఏపీ కేబినెట్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది

Update: 2025-12-13 01:59 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. నెలకు రెండు సార్లు మంత్రి వర్గ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన కేబినెట్ భేటీని నిర్వహించాలని నిర్ణయించారు. కీలకమైన అంశాలను చర్చించనున్నారు.

కేబినెట్ భేటీలో...
అయితే ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించేందుకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించి ఈ నెల 22వ తేదీ సాయంత్రం నాలుగు గంటలోపు సాధారణ పరిపాలన శాఖలో తెలియచేయాలని చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా 24వ తేదీన మంత్రి వర్గ సమావేశంలోనూ రాజధాని అమరావతికి సంబంధించిన ముఖ్యమైన భూ కేటాయింపులు, రెండో విడత భూ సేకరణ, నిధుల పై చర్చించి ఆమోదించే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News