Andhra Pradesh : మరో హామీని గ్రౌండ్ చేసిన కూటమి సర్కార్

కూటమి ప్రభుత్వం మరో హామీని నిలబెట్టుకుంది.

Update: 2025-12-17 04:27 GMT

కూటమి ప్రభుత్వం మరో హామీని నిలబెట్టుకుంది. హజ్ యాత్రికులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం వర్తింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లే వారికి ఈ సాయం వర్తిస్తుంది. హజ్ యాత్రికులకు వెళ్లే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు హామీలు ఇచ్చాయి.

హజ్ యాత్రకు వెళ్లే వారికి...
ఆ ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాయి. అయితే ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ లక్ష రూపాయల ఆర్థిక సాయం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. హజ్ యాత్రకు ఏటా అనేక మంది వెళ్లి అక్కడ మక్కా మసీదును దర్శించుకుని వస్తుంటారు. అందులో భాగంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.


Tags:    

Similar News