Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10.45 గంటలకు సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు.ఉదయం 11 గంటలకు వైద్యారోగ్యశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
వివిధ శాఖలపై సమీక్ష...
మధ్యాహ్నం 2.30 గంటలకు వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు, మంత్రి తో సమీక్ష నిర్వహిస్తారు. వైద్యారోగ్యశాఖపై సమీక్షలో రానున్న రోజుల్లో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించనున్నారు. అలాగే వ్యవసాయ శాఖపై కూడా ఈ నెల 24వ నుంచి ప్రారంభం కానున్న రైతన్నా మీకోసం కార్యక్రమంపై అధికారులతో మాట్లాడనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి క్యాంపు కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు.