Chandrababu :నేడు ధాన్యం సేకరణపై చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు

Update: 2025-12-10 04:40 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఈరోజు ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపణలు చేస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ అంశంపై సమీక్ష నిర్వహించనున్నారు.

మంత్రులు, హెచ్ఓడీలతో...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10.15 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం 10.30 గంటలకు 5వ బ్లాక్‌లో సెక్రటరీలు, హెచ్ఓడీలతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ధాన్యం కొనుగోలుపై సమీక్ష చేస్తారు. ఇప్పటి వరకూ రైతుల నుంచి ఎంత ధాన్యాన్ని సేకరించారన్న దానిపై అధికారులను అడిగి తెలుసుకుంటారు. వారికి దిశానర్దేశం చేస్తారు. సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు


Tags:    

Similar News