ఉల్లి రైతులకు భారీ రిలీఫ్

కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది

Update: 2025-09-23 03:21 GMT

కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది. రైతుల కష్టాలు తీర్చేందుకు మార్కెట్ ఫెడ్ ద్వారా క్వింటాల్ ఉల్లిని 1200 రూపాయలకు కొనుగోలు చేస్తోంది. గత కొంతకాలంగా ఉల్లి రైతులు మద్దతు ధర లభించక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఉల్లి ధరలు పతనం కావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది.

నష్ట పరిహారం ఇవ్వాలని...
కర్నూలు వ్యవసాయ మార్కెట్లో 45 కేజీల ఉల్లిపాయల సంచిని రూ.100కు ఇస్తుండటంతో కిలో ఉల్లిపాయలు రెండు రూపాయలకే వస్తోంది. దీంతో తమకు సాగు చేసిన ఖర్చులు కూడా రావడం లేదని ఉల్లి రైతులు వాపోతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్దతు ధర ప్రకటించడంతో పాటు పరిహారం కూడా ప్రకటించారు. హెక్టారుకు రూ.50 వేల నష్టపరిహారం కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News