Andhra Pradesh : వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అచ్చెన్న
శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు
శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని తెలిపారు. రైతును రాజుగా నిలబట్టేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెప్పారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలని, ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామనిచెప్పారు.
అన్నదాత సుఖీభవ...
రైతు కుటుంబానికి ఏటా ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద నిధులు ఇస్తున్నామని అచ్చెన్నాయుడు చెప్పారు. వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83గా నమోదయిందన్నారు. దేశ వ్యవసాయ రంగంలో ఏపీ ఉత్పత్తి వాటా పది శాతమని, ఇది ఆంధ్రప్రదేశ్ కు గర్వ కారణమని అచ్చెన్నాయుడు అన్నారు. సర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనగావ్యవసాయ రంగాన్ని తమ ప్రభుత్వం గ్రోత్ ఇంజిన్ గా తీసుకుంటుందని తెలిపారు. రైతులకు ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించడంతో పాటు పంటలకు సరైన గిట్టుబాటుధర కల్పిస్తామని తెలిపారు.