భారీగా పెరిగిన మిర్చి ధరలు.. క్వింటాల్ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ధర భారీగా పెరిగింది

Update: 2026-01-21 06:00 GMT

తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ధర భారీగా పెరిగింది. వరంగల్ ఎనుమాములలో ఎల్లో మిర్చి ధర ఇవాళ క్వింటాల్ 44 వేల రూపాయలు పలికింది. దిగుబడి తగ్గడం, పచ్చళ్ల సీజన్ కావడంతో మిరపపొడికి వినియోగించే మిర్చి క్వింటాల్ మార్కెట్లో 20 వేల రూపాయలు దాటింది. గుంటూరు, మలక్పేట, ఖమ్మం మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

మిర్చి భారీగా పెరిగి...
దేవనూర్ డీలక్స్ మిర్చి ఏకంగా నాలుగు వేల రూపాయలు పెరిగింది. ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు వినియోగదారులు మాత్రం కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎండు మిర్చి తప్పనిసరిగా వంటకు వినియోగించాల్సి రావడంతో ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సి ఉ:టుంది. మరొకవైపు మిర్చి ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News