వందేభారత్‌ రైలులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

వందేభారత్‌ రైలులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రయాణం చేశారు

Update: 2025-11-29 03:48 GMT

వందేభారత్‌ రైలులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రయాణం చేశారు. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వందేభారత్ రైలులో ప్రయాణం సౌకర్యవంతంగా ఉందా? లేదా? అన్న విషయం వారిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా వరంగల్ చేరుకోవడానికి ఈ రైలు ఉపయోగపడుతుందని ప్రయాణికులు తెలిపారు.

ప్రయాణికులతో మాట్లాడి...
వందేభారత్ రైలులో ప్రయాణం సుఖవంతంగా, సౌకర్యవంతంగా ఉందని ప్రయాణికులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలిపారు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన రైలు వందేభారత్ గురించి ప్రజల నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రయాణికులతో కిషన్ రెడ్డి హుషారుగా మాట్లాడారు. త్వరలోనే మోదీ చేతుల మీదుగా మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభోత్సవం ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు.


Tags:    

Similar News