Revanth Reddy : నేడు వరంగల్ జిల్లాకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి వరసగా జిల్లాల పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శంకుస్థఆపనలు చేయనున్నారు.
పలు అభివృద్ధి పనులకు...
అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో మంచివారిని గెలిపించాంటూ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయనున్నారు. దీంతో పాటు తమ రెండేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన హామీలను గురించి ప్రస్తావించనున్నారు.