Harish Rao : నేడు వరంగల్ కు హరీష్ రావు

నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో హరీష్‌రావు పర్యటించనున్నారు

Update: 2025-11-18 05:50 GMT

నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో హరీష్‌రావు పర్యటించనున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌యార్డులో హరీష్ రావు పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. పత్తి రైతులను హరీష్‌రావు పరామర్శించనున్నారు. పత్తి కొనుగోళ్లు తెలంగాణలో నిలిచిపోవడంతో వారిని కలుసుకునేందుకు హరీష్ రావు అక్కడకు చేరుకుంటారు.

వ్యవసాయ మార్కెట్ కు చేరుకుని
పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు గత కొద్దిరోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. వారిని పరామర్శించి వారి ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుందని భరోసాను హరీష్ రావు ఇవ్వనున్నారు. అదే సమయంలో అక్కడ ఆందోళనకు దిగే అవకాశాలున్నాయని భావించి పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు హరీష్‌ రావు చేరుకోనున్నారు.


Tags:    

Similar News