మాజీ ప్రొఫెసర్ కు సైబర్ నేరగాళ్లు కోటి టోకరా
వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్ ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు
వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్ ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. స్టాక్ మార్కెట్‌తో పెట్టుబడి పేరుతో కోటి రూపాయలు కేటుగాళ్లుకొట్టేశారు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం BULLONTRADE.COM సైట్‌ను బాధితుడు సెర్చ్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.ఇన్ వెస్ట్ మెంట్ ప్లాన్ లింక్ క్లిక్ చేసి వాట్సాప్ నెంబర్ కూడా బాధితుడు ఇచ్చాడు.
వాట్సాప్ గ్రూపుతో ...
H_18 వాట్సాప్ గ్రూప్‌తో యాడ్ చేసి పూర్తిగా నమ్మించిన నేరగాళ్లు, కంపెనీ అకౌంట్స్ మేనేజర్‌గా పరిచయం చేసుకున్న కిరణ్ అనే వ్యక్తిని నమ్మి ఒక కోటి ఒక వెయ్యి రూపాయలు బాధితుడు సుధాకర్ బదిలీ చేశారు. జనవరి నుండి ఇప్పటివరకు విడతల వారీగా నేరగాళ్ల ఖాతాలకు బాధితుడు డబ్బులు పంపాడు. చివరకు మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.