Telangana : నేడు ప్రయివేటు విద్యా సంస్థల బంద్

నేడు విద్యాసంస్థల యాజమాన్యాలపై దాడికి నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ జరగనుంది

Update: 2025-11-13 02:26 GMT

నేడు విద్యాసంస్థల యాజమాన్యాలపై దాడికి నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ జరగనుంది. ఈ మేరకు ప్రయివేటు విద్యాసంస్థలు బంద్ ను పాటించాలని అన్ని ప్రయివేటు పాఠశాలలు, కళశాలలను బంద్ చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి. విద్యార్థి సంఘ నాయకులు చందాల పేరిట దందాలకు పాల్పడుతుండటాన్ని నిరసిస్తూ ఈ బంద్ నిర్వహిస్తున్నారు.

విద్యార్థి సంఘ నేతల దాడికి నిరసనగా...
చందాల కోసం పాఠశాలకు వెళ్లిన ఒక విద్యార్థి సంఘం నాయకులు స్కూల్ యాజమాన్యంపై దాడి చేశారు. సీసీ కెమెరాల్లోనూ ఆ దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. విద్యార్థి సంఘ నేతలపై హనుమ కొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. విద్యార్థి సంఘాల చందాల నుంచి తమకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యం బంద్ కు పిలుపు నిచ్చింది. పోలీసులు ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News