Telangana : నేడు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణలో మొంథా తుపాను ప్రభావితమైన జిల్లాల్లోని విద్యాసంస్థలకు నేడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది
తెలంగాణలో మొంథా తుపాను ప్రభావితమైన జిల్లాల్లోని విద్యాసంస్థలకు నేడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రధానంగా హన్మకొండ, వరంగల్ జిల్లాలు తుపాను కు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాలలో నీరు చేరింది. రోడ్లపైకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఇంకా నీరు తొలగిపోలేదు. అదే సమయంలో నేడు కూడా వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది.
హన్మకొండ, ములుగు జిల్లాల్లోని...
ఈ హెచ్చరికతో నేడు హన్మకొండ, ములుగు జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రజలు ఈరోజు కూడా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. వరద నీరు రోడ్లపైన ఉన్నందున, నేడు కూడా వర్షం పడే అవకాశముండటంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.