Andhra Pradesh : గూగుల్ రాకతో ఏపీకి లాభమెంతంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నాన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నగరంగా మార్చేందుకు ఈ ఒప్పదం పునాది వేసినట్లయిందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమయింది.
పది బిలియన్ డాలర్ల...
ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖలో గూగుల్ దాదాపు పది బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, మంత్రి నారా లోకేశ్ తో పాటు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో దేశంలో మరింత పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని చెప్పారు.