Ys Jagan : జగన్ పర్యటనకు ముందు నర్సీపట్నంలో వెలిసిన ఫ్లెక్సీలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా నర్సీపట్నంలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా నర్సీపట్నంలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. నర్సీపట్నం మెడికల్ కళాశాల సందర్శనకు వస్తున్న జగన్ ను ఉద్దేశించి వ్యతిరేకంగా కొందరు ఫ్లెక్సీలను పెట్టారు. వైసీపీ నెవర్ ఎగైన్ అంటూ ఫ్లెక్సీలు వెలిశఆయి. మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసే వాళ్లు, మెడికల్ గురించి మాట్లాడటమా? ప్రజలు.. తస్మాత్ జాగ్రత్త అంటూ ఫ్లెక్సీలలో రాసి ఉంది.
సుధాకర్ పొటోతో...
కరోనా విజృంభిస్తున్న సమయంలో మాస్క్ ను అడిగినం డాక్టర్ సుధాకర్ ఫొటోతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం నాటి వైసీపీ ప్రభుత్వమేనని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు కొద్దిసేపు ముందు నర్సీపట్నంలో వెలిసిన ఫ్లెక్సీలపై వైసీపీ నేతలు అభ్యంతరం చెబుతున్నారు. జగన్ పర్యటన వేళ పరిస్థితి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.