Chandrababu : నేడు విశాఖకు చంద్రబాబు నాయుడు
నేడు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించన్నారు.
నేడు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించన్నారు. ఉదయం11 గంటలకు విశాఖ చేరుకోనున్న చంద్రబాబు అక్కడ జరిగే వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం11:45 గంటలకు మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు బీచ్‌రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటారు.
వివిధ కార్యక్రమాల్లో...
మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు జీసీసీ బిజినెస్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఫ్రెంచ్ బృందంతో ఆయన సమావేశమవుతారు. సాయంత్రం ఐదు గంటలకు నెదర్లాండ్స్ బృందంతో చంద్రబాబు భేటీ కానున్నారు. విశాఖ నుంచి రాత్రి 9 గంటలకు ఉండవల్లి నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు.