తెలుగుపోస్ట్ టాప్ 10 వార్తలు (5-5-2023)

Update: 2023-05-05 13:10 GMT

పల్లె రవికి నామినేటెడ్ పదవి

తెలంగాణ కల్లు గీత గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా పల్లె రవికుమార్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా పల్లె రవి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. మునుగోడులో బీఆర్ఎస్ విజయానికి పల్లె రవి చేరిక కొంత ఉపయోగపడిందని కేసీఆర్ భావిస్తున్నారు.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


రాజధాని కేసులపై...?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులపై సుప్రీం కోర్టులో జులై 11న విచారణ జరగనుంది. చనిపోయిన పిటిషనర్ల స్థానంలో వేరొకరికి అవకాశం కల్పించాలంటూ పలువురు రైతులు ఎల్‌ఆర్‌ అప్లికేషన్‌ దాఖలు చేశారు. రైతులు దాఖలు చేసిన తాజా పిటిషన్‌పై మే 9న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


మణిపూర్‌లో "కనిపిస్తే కాల్చివేత"

మణిపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను జారీచేసింది. ఇరు వర్గాలు ఒకరి ఇళ్లపై ఒకరు దాడులకు దిగడంతో ఆర్మీ రంగ ప్రవేశం చేసింది.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


తెలంగాణ కుంభమేళా.. మేడారం మహా జాతర తేదీలు ఖరారు

తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పిలువబడే మేడారం మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతర తేదీలను పూజారులు నిర్ణయించారు.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


పాక్ కు సీక్రెట్ సమాచారం లీక్.. భారత డీఆర్డీఓ సైంటిస్ట్ అరెస్ట్

పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన ఐఎస్ఐ ఏజెంట్ కు భారత్ కు చెందిన కీలక సమాచారాన్ని అందించిన సీనియర్ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ ను ముంబై ఉగ్ర కార్యకలాపాల నిరోధక దళం (ఏటీఎస్) అరెస్ట్ చేసింది.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీగా పోలీసులు

రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వస్తున్నారు.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


లొంగిపోయిన ఎర్రగంగిరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఎర్రగంగిరెడ్డి కొద్దిసేపటి క్రితం సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఎర్ర గంగిరెడ్డి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడుగా ఉన్నారు. ఆయనకు గతంలో బెయిల్ ఇచ్చింది.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఏపీలో ఏసీబీ పంజా

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గత ఐదు రోజుల నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


సార్ ప్లీజ్.. మా నాన్నకు బుద్ధి చెప్పండి : పోలీసులకు చిన్నారి విజ్ఞప్తి

పిల్లల ముందు తల్లిదండ్రులు ప్రవర్తించే తీరుని బట్టే.. వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. తన తండ్రి రోజూ తాగివచ్చి తల్లిని కొడుతుండటం తట్టుకోలేక పోయిన ఓ బాలుడు.. తన తండ్రికి బుద్ధి చెప్పాలని కోరుతూ ఏకంగా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


అమరావతి రైతులకు బిగ్ షాక్

ఆర్-5 జోన్ పై ప్రభుత్వానికి హైకోర్టు అనుకూలంగా తీర్పు చెప్పింది. జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేసింది.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Similar News