టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-12-08 12:45 GMT


Note: please click the headline links


Revanth Reddy : సంక్షోభం తలెత్తేలా కుట్ర జరిగింది : సమీక్షలో సీఎం


తొలి మంత్రి వర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రధానంగా విద్యుత్తు శాఖపై ఎక్కువగా దృష్టి పెట్టారు ఆ శాఖలో నిధులు ఎక్కువగా దుబారా అయ్యాయయన్న ఆరోపణలు ఆయన గతం నుంచే చేస్తున్నారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే తొలి మంత్రి వర్గ సమావేశంలో విద్యుత్తు శాఖపై ఎక్కువగా చర్చించారు.

Junior Mehmood : క్యాన్సర్‌తో బాలీవుడ్ నటుడు మరణం..

జూనియర్ మెహమూద్ గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నయీమ్ సయ్యద్ నేడు శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కడుపు క్యాన్సర్‌ వలన నయీమ్ మృతి చెందారట. ఈ క్యాన్సర్ విషయం 18 రోజుల క్రితమే బయటపడిందట

Heart Attack: చలికాలంలో ఈ తప్పులు చేస్తే గుండెపోటు రావచ్చు!

శీతాకాలం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సమయంలో గుండెపోటు కేసులు కూడా పెరుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో ఎపినెఫ్రిన్, కార్టిసాల్ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. దీని పెరుగుదల కారణంగా శరీరంలో రక్తపోటు పెరుగుతుంది.

ATM, QR కోడ్‌ మోసాలకు చెక్‌పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం

ఈ రోజుల్లో చిన్న కిరాణ కొట్టు నుంచి కూరగాయాలు అమ్మే వ్యాపారి, పెద్ద పెద్ద మాల్స్‌ వరకు అన్ని షాపుల్లో డిజిటల్‌ చెల్లింపులు జరుగుతున్నాయి. జేబులోంచి ఒక్కరూపాయి కూడా తీయకుండానే ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌లు జరుగుతున్నాయి. టెక్నాలజీ పెరిగినకొద్ది యూపీఐ లావాదేవీలు జరపడం మరింత సులభతరం అవుతున్నాయి. కానీ టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది మోసాలు కూడా పెరిగిపోతున్నాయి.

Pawan Kalyan : ఎగతాళి చేసినోళ్లకు సరైన ఆన్సర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ తాను పోటీ చేయనునున్నట్లు ప్రకటించారు. అయితే ఎక్కడి నుంచి అనేది మాత్రం స్పష్టం చేయలేదు. నిన్న విశాఖలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తాను పోటీ చేసిన నియోజకవర్గంలో వైసీపీ వెయ్యి కోట్లు పెట్టయినా తనను ఓడించడానికి సిద్ధపడుతుందన్నారు.

ఇంటింటికీ రూ.2,500: సీఎం జగన్

తుపాను కారణంగా దెబ్బతిన్న తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు పర్యటించారు. తిరుపతి జిల్లా బాలిరెడ్డిపాలెంలో ఆయన మాట్లాడుతూ.. తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికీ తిరిగి రూ.2,500 ఇస్తారని హామీ ఇచ్చారు.

కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్, హరీష్ రావు కీలక వ్యాఖ్య

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ ను యశోదా ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. తన నివాసంలోని బాత్రూమ్ లో కేసీఆర్ జారి పడడంతో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి ఆయనను తీసుకొచ్చారని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. సీటీ స్కాన్ తో పాటు పలు పరీక్షలను నిర్వహించగా ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించామని చెప్పారు. ఆయన ఎడమ తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని వెల్లడించారు.

Ram Charan : రామ్‌చరణ్ ఇంట నెట్‌ఫ్లిక్స్ సీఈఓ.. హాలీవుడ్ ప్రాజెక్ట్..!


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నారు. దీంతో ఆయనతో సినిమాలు చేయడానికి అగ్ర నిర్మాతలు దర్శకులు పోటీ పడుతున్నారు. కానీ చరణ్ మాత్రం చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కేవలం ఇండియాలో ఉన్న సినీ ఇండస్ట్రీస్ నుంచి మాత్రమే కాదు హాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ని అవకాశాలు వస్తున్నాయి.

ఏయే బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏ ఐడీ ఉండాలి?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9వ తేదీ శనివారం మధ్యాహ్నం నుండి బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మాత్రమే మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 8న ఉత్తర్వులు జారీ చేసింది.

Malla Reddy : మల్లారెడ్డి వణికిపోతుంది అందుకేనట.. ఆ రూట్లే వస్తే ఏం చేయాలి?

మాజీ మంత్రి మల్లారెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు పొసగదు. టీడీపీలో కలసి పనిచేసినా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. సవాళ్ల మీద సవాళ్లు విసురుకున్నారు. తనను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారంటూ పలుమార్లు మల్లారెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. మల్లారెడ్డి తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేశారు
















Tags:    

Similar News